తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పధకంపై.. మంత్రి నాదెండ్ల కీలక వ్యాఖ్యలు

05:54 PM Oct 25, 2024 IST | Teja K
UpdateAt: 05:54 PM Oct 25, 2024 IST
Advertisement

రాష్ట్రంలో మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈ దీపావళి నుంచి ప్రారంభించనున్నట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 31న లాంఛనంగా ప్రారంభిస్తారని, ప్రతి ఇంటికి మొదటి గ్యాస్ సిలిండర్ వెంటనే అందజేస్తామన్నారు. ఈ పథకంలో ఎల్పీజీ కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు అమలు చేస్తున్నామని మంత్రి నాదెండ్ల తెలిపారు.
ఈ నెల 29 నుంచి ఉచిత గ్యాస్‌ సిలిండర్లను బుకింగ్‌ చేసుకోవచ్చు మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. పట్టణాల్లో 24 గంటల్లోపు, గ్రామాల్లో 48 గంటల్లోపు గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ అవుతుంది మంత్రి నాదెండ్ల అన్నారు. ఈ పథకం ద్వారా ఏపీ సర్కార్‌కు ప్రాథమికంగా రూ.2,674 కోట్లు ఖర్చవుతుంది..మొత్తం సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

Advertisement

Advertisement
Tags :
andhrapradeshcm chandrababuidenijam newsIdenijam.comMinister Nadendla'scheme of free gas cylinderstelugu latest news in idenijam
Advertisement
Next Article