‘మట్కా' మూవీ రివ్యూ.. వరుణ్ తేజ హిట్ కొట్టాడా లేదా..?
వరుణ్ తేజ్ నటించిన సినిమా ‘మట్కా’. ఈ సినిమాకి కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వరుణ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. వరుణ్ తేజ వరుస ప్లాపులు తర్వాత బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించాలని ఆసక్తిగా ఈసారి వస్తున్నాడు. ఈ సినిమా భారీ అంచనాలు మధ్య ఈరోజు థియేటర్లలో విడుదలైంది. అయితే ఈసారి అయినా వరుణ్ తేజ్ 'మట్కా' సినిమాతో హిట్టు ఇచ్చాడా లేదా అని తెలుసుకుందాం.
ముందుగా కథ విషయానికి వస్తే కూలీగా పనిచేసిన హీరో జీవితంలో ఎదగాలని అనుకుంటాడు. అయితే ఈ క్రమంలో అక్రమ వ్యాపారంలో హీరో ఒక్కో మెట్టు ఎక్కుతాడు. తన జీవితంలో ఎదురైనా శత్రువులను దాటుకుని హీరో ఎలా ఎదిగాడు అన్నదే కథాంశం. అయితే ఈ సినిమాలో వరుణ్ తేజ నటన మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో ఒక యువకుడిగా, మధ్య వయస్కుడిగా, ఆలాగే తండ్రి పాత్రలో వరుణ్ బాగా నటించాడు. ఈ సినిమాలోని హీరోయిజం ఎలివేట్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.ఈ సినిమాకి జి.వి. ప్రకాష్ కుమార్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలోని డైలుగులు బాగానే ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో పెద్ద మైనస్ మాత్రం కధ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా కథ మనం చాలా సినిమాల్లో చూసినట్టే అనిపిస్తుంది కాబట్టి కొత్తగా ఏమి అనిపించింది.ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా చాలా పేలవంగా ఉంటుంది. ఈ సినిమా ఓన్లీ మాస్ ఆడియన్స్ ని మాత్రం ఆకట్టుకుంటుంది.