లగచర్ల ఘటనను రాజకీయ దాడిగా చిత్రీకరిస్తున్నారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
పోలీసులు లగచర్ల రైతుల పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్ర హింసలు పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కొడంగల్ సీఐ, ఎస్ఐ వికారాబాద్ ఎస్పీ వీళ్ళంతా కలిసి లగచర్ల రైతుల పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్ర హింసలు పెట్టారు. కాళ్ళు, చేతులు కమిలిపోయి ఉన్నాయి మేజిస్ట్రేట్ ముందు ఎందుకు చెప్పలేదు అని అడిగితే.. చెప్తే మల్లి కొడతాము, మీ ఇంటికి పోయి ఇంట్లో వాళ్ళని కూడా కొడతామని బెదిరించారని కేటీఆర్ అన్నారు. దాడి జరిగినప్పుడు ఊరిలో లేని వాళ్లని కూడా అరెస్ట్ చేశారు అని నిలదీశారు. కులగణన కోసం వచ్చిన ప్రభుత్వ ఉద్యోగి అక్కడ లేకపోయినా కూడా అతన్ని అరెస్ట్ చేసి జైలులో పెట్టారని అన్నారు. వనపర్తిలో ఐటీఐ చదువుతున్న ఒక గిరిజన విద్యార్థి.. గొడవ జరిగింది కదా ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారని చూసి పోదామని వస్తే అతన్ని కూడా అరెస్ట్ చేశారు కేటీఆర్ ఆరోపించారు. 70 మందిని అరెస్ట్ చేస్తే తిరుపతి రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన 21 మందిని మాత్రమే ఉంచి కాంగ్రెస్ వాళ్ళని పంపించేశారు. దుద్యాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శేఖర్ అనుచరలు.. రమేష్, నర్సింహులు, రాములు నాయక్ కూడా దాడిలో పాల్గొన్నారు.. కాని తిరుపతి రెడ్డి ఫోన్ చేయగానే వాళ్లను వదిలేశారు అని తెలిపారు. ఈ దాడి మొత్తం బీఆర్ఎస్ వాళ్లే చేపించారని.. ఇది రాజకీయ దాడిగా చిత్రీకరిస్తూ రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.