నాంపల్లి స్పెషల్ కోర్టుకు చేరుకున్న కేటీఆర్
04:50 PM Oct 23, 2024 IST | Teja K
UpdateAt: 04:53 PM Oct 23, 2024 IST
Advertisement
తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఇటీవల మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే ఈ విషయంపై నాంపల్లి కోర్టులో కొండా సురేఖపై కేటీఆర్ 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేశారని మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి వాంగ్మూలం ఇచ్చేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోర్టుకు వచ్చారు. దీంతో మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు సాక్షుల వాంగ్మూలాలను కూడా కోర్టు నమోదు చేయనుంది.
Advertisement