రైతు భరోసా పై కీలక నిర్ణయం.. ఆ రైతులకు భరోసా కట్..!
త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతులకు ఊహించని షాక్ ఇవ్వనుంది. రైతు భరోసా పథకంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో లక్షలాది మంది రైతులలో రైతు భరోసా సొమ్ము కొందరికి మాత్రమే వచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కుణ గణన చేపట్టనుంది. ఈ సర్వేలో భూమి వివరాలను కూడా సర్వే సిబ్బంది నమోదు చేస్తారు. దీంతో ఒక్కో కుటుంబానికి ఎంత భూమి ఉందో తెలుస్తుంది. ఈ వివరాల ప్రకారం రైతులకు పంట భరోసా పథకాన్ని అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏటా రైతుకు ఎకరాకు రూ.15 వేల వరకు చెల్లిస్తుందన్నారు. అయితే రైతుల రుణమాఫీ కారణంగా గత 2 పంటలకు రైతు భరోసా చెల్లించలేదు. అయితే ఈ సర్వే పూర్తయితే 7 నుంచి 10 ఎకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులను గుర్తించి సాగు చేసిన భూమికి మాత్రమే రైతు భరోసా కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. అసలు అర్హులకు పంటసాయం అందుతుందని, తద్వారా అసలైన అర్హులకు పంట సాయం అందడంతోపాటు ప్రభుత్వానికి ఖర్చు వృథా అవ్వదు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.