తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

వైసీపీ రహస్య జీవోపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అధికారులకు ఆదేశాలు జారీ

05:25 PM Oct 28, 2024 IST | Teja K
UpdateAt: 05:26 PM Oct 28, 2024 IST
Advertisement

వైసీపీ ప్రభుత్వ హయాంలో రహస్య జీవోలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవోఐఆర్ వెబ్‌సైట్‌లో అన్ని రహస్య జీవోలను అప్‌లోడ్ చేయాలని నిర్ణయించింది. ఆ వెబ్‌సైట్‌లో ఆగస్టు 15, 2021 నుండి ఆగస్టు 28, 2024 వరకు రహస్య జీవోలను అప్‌లోడ్ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గోప్యంగా ఉంచిన అన్ని జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జీవోఐఆర్ వెబ్‌సైట్‌ను అప్‌డేట్ చేయాలని, పాత జీఓలన్నింటినీ అందులో అప్‌లోడ్ చేయాలని ఐటీ ఎలక్ట్రానిక్స్ విభాగం అధికారులను ఆదేశించారు. వెబ్‌సైట్ ప్రారంభించిన 2008 నుండి ఇప్పటి వరకు అన్ని జీవోలు ఉన్నప్పటికీ, వైసిపి ప్రభుత్వ హయాంలో ఆగస్టు 15, 2021 నుండి ఆగస్టు 28, 2024 వరకు మాత్రమే జీవోలు అందుబాటులో లేవని సాధారణ పరిపాలన శాఖ వెల్లడించింది.

Advertisement

Advertisement
Tags :
andhra pradeshap governmentconfidential GEOsGVOIRlatestnewsS. Suresh Kumarycp government
Advertisement
Next Article