తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

రైతు భరోసాపై కీలక ప్రకటన.. ఎకరాకు రూ.7500 ఖాతాల్లో అప్పుడే..!

02:00 AM Nov 14, 2024 IST | Vinod
UpdateAt: 05:38 PM Nov 13, 2024 IST
Advertisement

రైతు భరోసా కోసం తెలంగాణ రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే రైతుభరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక రాగానే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని మంత్రి తెలిపారు. నివేదిక రాగానే రాబోయే పంట కాలం నుంచి రైతులకు ఎకరాకు రూ.7500 సాయం అందిస్తామని తెలిపారు. ఎకరా నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి రైతుభరోసాను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహించనుంది.

Advertisement

Advertisement
Tags :
cm revanth reddyidenijam newsidenijam telugu newsidenijam updatesrythu bharosatelangana govt
Advertisement
Next Article