దిశా పటాని తండ్రిని మోసం చేసిన కేట్టుగాలు..! ఏకంగా ఎంత టోకరా పెట్టారంటే..?
బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ తండ్రి జగదీశ్ సింగ్ పటానీకి రూ.25 లక్షలకు కుట్టుటోపి పెట్టి మోసగాళ్లు మోసం చేసారు. దిశా పటానీ తండ్రి జగదీష్ సింగ్ పటానీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా పదవీ విరమణ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో నివసిస్తున్న తనను ఇటీవల సంప్రదించిన శివేంద్ర ప్రతాప్ సింగ్.. జగదీష్‌కు రాజకీయాల్లో ఉన్నత స్థానం వస్తుందని చెప్పాడు. అలాగే, అతడిని తన భాగస్వామి శివేంద్ర ప్రతాప్‌కు పరిచయం చేశాడు. ఈ పరిస్థితిలో, శివేంద్ర ప్రతాప్ తనకు రాజకీయ లేదా ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని జగదీష్‌కు తప్పుడు హామీ ఇచ్చాడు. అంతేకాదు డబ్బులు కూడా డిమాండ్ చేశారు. దీన్ని నమ్మిన జగదీష్ రూ. 25 లక్షలు వారికీ ఇచ్చారు. అయితే తరువాత ఒకే వేళా పని జరగలేదంటే మూడు నెలల్లో వడ్డీతో సహా చెల్లిస్తానని జగదీశ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో.. ఆ గ్యాంగ్ బెదిరింపులు స్టార్ట్ చేసినట్లు తెలిసింది. ఫ్రాడ్ జరిగిందని గ్రహించిన దిశా పఠానీ తండ్రి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. దీని తరువాత, జగదీష్ తనను మోసగించినందుకు శివేంద్ర ప్రతాప్ మరియు అతని సహచరులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.