కార్తీక మాసం విశిష్టత.. ముఖ్యమైన రోజులు ఇవే..!
ప్రతి ఏటా కార్తీక మాసం మొదటి రోజున భక్తులందరూ బ్రహ్మ ముహూర్తంలో నదీ స్నానం చేసి, దీపం వెలిగించి తమ ఇష్టదైవానికి పూజ చేయడం ద్వారా తమ దినచర్యను ప్రారంభిస్తారు. సుర్యోదయానికి పాడ్యమి తిథి ఉన్న రోజునే కార్తీక మాసం ప్రారంభంగా పరిగణలోకి తీసుకుంటారు. అందుకే ఈ సంవత్సరం నవంబరు 02న కార్తీక మాసం ప్రారంభమవుతోంది. అన్ని మాసాలలో కెల్లా అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం. తెలుగు సంవత్సరంలో వచ్చే ఎనిమిదో మాసం ఇది. చంద్రుడు కృత్తిక నక్షత్రంలో ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది.
ఈ ఏడాది కార్తీక మాసంలో ముఖ్యమైన రోజులు
2024 నవంబరు 02 శనివారం కార్తీక మాసం ప్రారంభం పాడ్యమి
నవంబరు 03 ఆదివారం యమవిదియ భగినీహస్త
భోజనం - భాయ్ దూజ్
నవంబరు 04 కార్తీక మాసం మొదటి సోమవారం
నవంబరు 05 మంగళవారం నాగులచవితి
నవంబరు 06 బుధవారం నాగపంచమి
నవంబరు 11 కార్తీక మాసం రెండో సోమవారం
నవంబరు 12 మంగళవారం మతత్రయ ఏకాదశి
నవంబరు 13 బుధవారం క్షీరాబ్ది ద్వాదశి
నవంబరు 15 శుక్రవారం కార్తీక పూర్ణిమ, జ్వాలా తోరణం, కేదారనోములు
నవంబరు 16 శనివారం వృశ్చిక సంక్రాంతి
నవంబరు 18 కార్తీక మాసం మూడో సోమవారం
నవంబరు 19 మంగళవారం సంకటహర చతుర్థి
నవంబరు 25 కార్తీక మాసం నాలుగో సోమవారం
నవంబరు 26 మంగళవారం ఏకాదశి
నవంబరు 30 శనివారం అమావాస్య తగులు
డిసెంబరు 01 ఆదివారం అమావాస్య మిగులు - పోలిస్వర్గం