తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే జగన్ రాజీనామా చేయాలి.. వైఎస్ షర్మిల డిమాండ్

04:58 PM Nov 08, 2024 IST | Teja K
UpdateAt: 04:58 PM Nov 08, 2024 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఇచ్చేది గుండు సున్నా అని వైఎస్‌ షర్మిల అన్నారు. అయినా ఏపీ సీఎం చంద్రబాబు పొత్తు పెట్టుకోవడం దారుణమని విమర్శించారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జగన్‌పై విరుచుకుపడ్డారు. అసెంబ్లీకి వెళ్లని వారు రాజీనామా చేయాలని షర్మిల సూచించారు. జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే పదవులు ఎందుకు? అసెంబ్లీకి వెళ్లకుంటే జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదుని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీకి మైక్ ఇచ్చే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం లేదని అన్నారు. అలాంటప్పుడు సమావేశాలకు హాజరవడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. అందుకే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదని జగన్ స్పష్టం చేశారు.

Advertisement

Advertisement

Tags :
andhrapradeshassemblyidenijam newsJagan should resignlatest newsYS Sharmila
Advertisement
Next Article