తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

జగన్, షర్మిల ఆస్తుల వివాదం… పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

08:29 PM Oct 25, 2024 IST | Teja K
UpdateAt: 08:30 PM Oct 25, 2024 IST
Advertisement

ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం మాజీ సీఎం జగన్, షర్మిల ఆస్తుల వివాదం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఈ విషయంపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నప్పుడే చాలా ఆస్తులు వారికీ రాసిచ్చారని అన్నారు. సాక్షి, భారతి సిమెంట్‌ కంపెనీలను జగన్‌ స్థాపించారన్నారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు జగన్ వాటిని స్థాపించారని గుర్తు చేశారు. ఆ కంపెనీల్లో షర్మిల, ఆమె భర్త అనిల్‌లు డైరెక్టర్లు కాదని ఆయన అన్నారు. అప్పుడు వచ్చిన కేసుల్లో జైలుకు వెళ్లింది జగన్ ఒక్కరేనని గుర్తు చేశారు. భారతి సిమెంట్ పేరుపై షర్మిల అప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. ఆస్థి వాటాల విషయంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు గుర్తుకు వస్తున్నారా అని పేర్ని నాని అన్నారు.

Advertisement

Advertisement
Tags :
andhra pardeshjaganJagan and Sharmila's property disputelatest newsPerni Nanisharimlatelugu latest news in idenijam
Advertisement
Next Article