క్రాకర్స్ కాల్చేటప్పుడు ఇలా చేస్తే ప్రమాదం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
02:36 PM Oct 30, 2024 IST | Shiva Raj
UpdateAt: 02:36 PM Oct 30, 2024 IST
Advertisement
- చేతిలో పట్టుకొని టపాసులను వెలిగించొద్దు. కాల్చే సమయంలో వాటిపైకి వంగకూడదు. ముఖం దూరంగా తిప్పి ఉంచాలి.
- అగరవత్తులు, కొవ్వొత్తులు వెలిగించిన చోట టపాసులను ఉంచొద్దు. వాటిని జేబులో పెట్టుకోవద్దు.
- ప్రతి ఒక్కరు కాటన్ దుస్తులు ధరిస్తే మంచిది.
- గాలులు వీస్తున్న సందర్భంలో టపాసులు వెలిగించవద్దు.
- కళ్లకు గాయాలైనా, కళ్లలో ఏదైనా పదార్థం ఇరుక్కున్నా వెంటనే వైద్యశాలకు తీసుకువెళ్లాలి.
- కాలిన చోట క్రీం లేదా నూనె లాంటివి పూయవద్దు. బదులుగా వైద్యులను సంప్రదించాలి.