For the best experience, open
https://m.idenijam.com
on your mobile browser.

రీఛార్జ్‌ చేయక మీ సిమ్‌కార్డు డీ-యాక్టివేట్ అయిందా.. ఎన్ని రోజుల్లో యాక్టివేట్ అవుతుందో తెలుసా.. ?

07:05 PM Nov 07, 2024 IST | Teja K
UpdateAt: 07:05 PM Nov 07, 2024 IST
రీఛార్జ్‌ చేయక మీ సిమ్‌కార్డు డీ యాక్టివేట్ అయిందా   ఎన్ని రోజుల్లో యాక్టివేట్ అవుతుందో తెలుసా
Advertisement

మీరు మీ మొబైల్‌కి రీఛార్జ్ చేయకపోతే అందులోని మీ సిమ్ కార్డ్ యాక్టివేట్ అవుతుందని మీకు తెలుసా.. కొన్ని రోజుల తర్వాత మీ మొబైల్ నంబర్ మరొకరికి కేటాయించబడుతుంది. అయితే మీ సిమ్ రీఛార్జ్ చేసుకోకపోతే ఎన్ని రోజులు పనిచేయదు తెలుసా? టెలికాం కంపెనీల నిబంధనలు ఏమిటి? డియాక్టివేట్ చేయబడిన SIM ఎంతకాలం పని చేస్తుంది వంటి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.
అయితే సిమ్ కార్డ్ బేసిక్ ప్లాన్ రీఛార్జ్ చేసుకోకపోతే, 30 రోజుల తర్వాత అవుట్‌గోయింగ్ కాల్స్ మరియు డేటా సేవలు ఆగిపోతాయి. ఈ నిర్ణయం ఆయా టెలికాం కంపెనీలపై ఆధారపడి ఉంటుంది. Airtel, Jio, BSNL, Vodafone-Idea వంటి అన్ని టెలికాం కంపెనీలు సాధారణంగా ఒక నెల తర్వాత అవుట్‌గోయింగ్ సేవలను నిలిపివేస్తాయి. 90 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం రీఛార్జ్ చేయకపోతే పూర్తిగా డీ-యాక్టివేట్ చేయబడుతుంది.
డీ-యాక్టివేటెడ్ సిమ్ కార్డ్‌ని మళ్లీ యాక్టివేట్ చేయడానికి మీరు మీ నెట్‌వర్క్ సర్వీస్ ప్రొవైడర్ కస్టమర్ కేర్‌ను సంప్రదించాలి. నెట్‌వర్క్ సంస్థకు వెళ్లి, కొత్త KYC డాక్యుమెంట్‌లతో వేరియేషన్ చేయండి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత సిమ్ మళ్లీ యాక్టివేట్ అవుతుంది. సాధారణంగా ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు ఒక సంవత్సరం పడుతుంది. అలాంటి ప్రయత్నాల జోలికి వెళ్లకుండా బేసిక్ ప్లాన్ తో ఎప్పటికప్పుడు మీకు అవసరమైన ఫోన్ నంబర్ రీఛార్జ్ చేసుకోవడం ముఖ్యం.

Advertisement
Tags :
Advertisement

.