చిల్లర మాటల్లో మీరు బ్రాండ్ అంబాసిడర్లు.. ఎమ్మెల్యే మల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
రంగారెడ్డి జిల్లాలో వేల ఎకరాల భూములు అమ్ముకున్న దరిద్రులు మీరే అంటూ కెసిఆర్ పై ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ గాంధీ కాదు గాడ్సే అని విరుచుకుపడ్డారు. తమ సీఎం రేవంత్ రెడ్డి మీలా చిల్లర మాటలు మాట్లాడలేదని ఆయన అన్నారు. మల్రెడ్డి తిట్టడం మొదలు పెడితే నీకంటే ఎక్కువగా తిట్టగలరని అన్నారు. చిల్లర మాటల్లో మీరు బ్రాండ్ అంబాసిడర్లు, హెడ్మాస్టర్లు అని దుయ్యబట్టారు. మూసీ పక్కనే ఉన్న స్థలాలను బీఆర్ఎస్ కార్యకర్తలు కబ్జా చేశారన్నారు. మామపై హరీష్ రావు కపట ప్రేమ చూపిస్తున్నారని.. మూసీ నీళ్లు తాగిస్తే కానీ కేటీఆర్, హరీష్ రావుకు బుద్ధి రాదని తెలిపారు. జెడ్పీటీసీ స్థాయి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు.నువ్వు మంత్రి ఎలా అయ్యావో అందరికీ తెలుసని హరీశ్ రావు విమర్శించారు. కెసిఆర్ కట్టిన గుళ్లో సీఎం పూజలు చేశాడని అంటున్నావు.. యాదగిరి గుట్ట నీ అబ్బ జాగీరా అంటూ హరీష్ రావుపై మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే పురుగులు పడిపోతారని విరుచుకుపడ్డారు.