బిగ్‌బాస్ సీజన్ 8 హౌస్‌లో.. పృథ్వీ, విష్ణుప్రియా బ్రేకప్.. కారణం ఏంటో తెలుసా..?
బిగ్‌బాస్ సీజన్ 8 హౌస్‌లో తాజాగా జరిగిన నామినేషన్స్ లో పృథ్వీ, విష్ణుప్రియా ఎక్కడా సింగిల్ గా కనిపించడం లేదు అంటూ.. హౌస్ మేట్స్ వారిద్దరిని నామినేట్ చేసారు. అయితే నామినేషన్ల ప్రక్రియ ముగిసిన వెంటనే విష్ణుప్రియాకి నీకు ఉన్నా బంధం ఏంటి అని పృథ్వీ ని యష్మీ అడిగింది. తను నాకు జస్ట్ ఫ్రెండ్ అంతే అని పృథ్వీ ఆన్సర్ ఇచ్చాడు. మరీ ఎందుకు తనతో మాత్రమే క్లోజ్ గా ఉంటున్నావ్.. మిగిలిన వాళ్లతో కాకుండా తనతో ఎందుకు క్లోజ్ గా ఉంటావ్ అని యష్మీ అడిగింది. నేనేమి తన దగ్గరకి వెళ్లి మాట్లాడట్లేదు.. తనే వచ్చి మాట్లాడుతుంది అని పృథ్వీ అనడు. ఇక యష్మితో మాట్లాడిన తర్వాత విష్ణుతో మీటింగ్ పెట్టాడు పృథ్వీ. మనం ఓవర్ అయినట్లు నీకు అనిపిస్తుందా అని అడగ్గా… లేదు అని చెప్పింది విష్ణుప్రియా చెపింది. నాకు ఎలాంటి రిలేషన్ వద్దు.. నాకు ఒంటరిగా ఉండడమే నాకు ఇష్టం.. ఈ విషయం నీకు ముందే చెప్పాను. నా మీద నీకు ఏమైనా అనిపిస్తుందంటే చెప్పు ఇక్కడే ఆపేద్దాం అని పృథ్వి అన్నాడు. దీంతో ఒకే అని విష్ణు ప్రియా చెప్పింది. నీకు ఏమనిపిస్తుంది.. రియల్ గా ఫీల్ అవుతుందా అని మళ్లీ అడగ్గా.. నవ్వుతూనే వెళ్లిపోయిన విష్ణుప్రియా.. నబీల్ ఏమైందని అడిగాడు. పృథ్వీ గురించి బాధపడుతున్నావా.. నీకు మంచి భర్త దొరుకుతాడులే అంటూ సలహా ఇచ్చాడు.