తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

రైతుభరోసా పై కీలక అప్డేట్.. త్వరలో రైతుల ఖాతాలో డబ్బులు జమ..!

02:10 AM Nov 11, 2024 IST | Shiva Raj
UpdateAt: 04:12 PM Nov 10, 2024 IST
Advertisement

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తోంది. ఏడాది కాలంలో ఎన్నో పథకాలు అమలు చేశామని చెప్తున్న సీఎం రేవంత్ సర్కార్.. దాదాపు 22 లక్షల మంది రైతులకు 18000 కోట్ల రుణాలను మాఫీ చేశారు. త్వరలో మరో 13 వేల కోట్లు రుణమాఫీ రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఇంత చేసిన తర్వాత కూడా రైతుల విషయంలో ఓ అపవాదు వెంటాడుతోందని రేవంత్ ప్రభుత్వం గుర్తించింది. అదే రైతు భరోసా.. అధికారంలోకి వస్తే 15వేలు ఇస్తామని చెప్పారు. కానీ ఏడాది గడిచినా ఇవ్వలేదని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. దీనితో ఒక ఎకరం నుండి ప్రారంభించి, డిసెంబర్ చివరి నాటికి రైతు భరోసాను పూర్తి చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం సమగ్ర కుల గణన సర్వేలో ఒక్కో కుటుంబానికి ఎంత భూమి ఉందనే వివరాలను అధికారులు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సర్వే పూర్తయిన తర్వాత 7 నుంచి 10 ఎకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులను గుర్తించి.. సాగు చేసిన భూమికి మాత్రమే రెండు విడతలుగా ఎకరానికి రూ. 7,500 భరోసా కింద ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలుస్తుంది.

Advertisement

Advertisement
Advertisement
Next Article