తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

అధికారులపై దాడులు జరిగితే ఉపేక్షించేది లేదు.. మంత్రి శ్రీధర్ బాబు

06:30 PM Nov 12, 2024 IST | Teja K
UpdateAt: 06:30 PM Nov 12, 2024 IST
Advertisement

వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో జరిగిన ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. పథకం ప్రకారమే కొందరు రైతులను రెచ్చగొట్టి కలెక్టర్ పై దాడికి పాల్పడ్డారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రైతుల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకునేందుకు కలెక్టర్‌ ప్రయత్నించారిని.. అయితే కొందరు అక్కడి ప్రజలను రెచ్చగొట్టి కలెక్టర్ పై దాడికి పాల్పడేలా చేసారు అని తెలిపారు. అధికారులపై దాడులు జరిగితే ఉపేక్షించేది లేదు.. ఈ ఘటనలో కుట్రదారులు ఎవరనే విషయాలపై సమగ్ర విచారణ చేస్తాం అని పేర్కున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాలేదని ఆక్రోశంతో ఇలా చేస్తున్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని చేపట్టినా బీఆర్ఎస్ అడ్డుకునేందుకు యత్నిస్తోంది.మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి చర్యలకు దిగలేదు అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని ఎవరు అడ్డుకుంటున్నారో తేలుస్తాం అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

Advertisement

Advertisement
Tags :
BRScollector dadiidenijam newsidenijam updatesMinister sridhar babutelaganavikarabad
Advertisement
Next Article