'రాజశేఖర్ రెడ్డి గారికి లోకం అంతా ఒకెత్తయితే..నేను ఒకెత్తు'.. వైఎస్సార్ అభిమానులకు షర్మిల లేఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ జగన్‌పై వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు వైఎస్ఆర్ అభిమానులకు మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు. వైఎస్ అభిమానులకు తెలియజేసే ప్రయత్నంలో భాగంగానే ఈ లేఖ రాశామని పేర్కొన్నారు. ఈరోజు ఉదయం సాక్షి పేపర్ చూశాను.. సాక్షి మీడియా జగన్ మోహన్ రెడ్డి చేతిలో ఉంది.. కాబట్టి ఏదైనా రాసి నమ్మించగలరు.. అయితే వైఎస్ఆర్ అభిమానులకు అసలు నిజాలు తెలియజేయాలనే నా ప్రయత్నం.. అమ్మ వైఎస్ విజయమ్మ, నాన్నల గురించి ఓ పుస్తకం రాశారు. అందులో మా నాన్నగారి గురించి ప్రత్యేకంగా రాసారు. అందులో 'రాజశేఖర్ రెడ్డి గారికి లోకం అంతా ఒకెత్తయితే.. తన బిడ్డ షర్మిల ఒకెత్తు అని రాశారు. నాన్నకు నేనంటే ప్రాణం. నాన్న నన్ను ఎప్పుడూ ఆడపిల్ల కదా అని చిన్న చేసో, తక్కువ చేసో చూడలేదు. నాన్న బతికి ఉన్నన్ని రోజులూ ఒకే మాట అనేవారు. 'నా' నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ నాకు సమానమని రాసారు తెలిపారు.
వైఎస్‌ఆర్ జీవించి ఉన్న సమయంలో నెలకొల్పబడిన అన్ని కుటుంబ వ్యాపారాల్లో నలుగురు పిల్లలకి సమాన వాటా ఉండాలి. అవి జగన్ మోహన్ రెడ్డికి చెందినవి కావు. ప్రస్తుతం ఉన్న కుటుంబ వ్యాపారాలన్నింటికీ జగన్ 'గార్డియన్'. నలుగురు పిల్లలకు అన్ని వ్యాపారాలను సమానంగా విభజించే బాధ్యత అతనిపై ఉంది. ఇది రాజశేఖర్ రెడ్డి గారి ఆదేశం. వైఎస్‌ఆర్ ఉద్దేశం మనకు, ఆయన పిల్లలకు, ఆయన భార్యకు, కేవీపీ రామచంద్రరావుకు, వైవీ సుబ్బారెడ్డికి, విజయసాయిరెడ్డికి, ఆయన సన్నిహితులందరికీ స్పష్టంగా తెలుసు. నాన్న బతికున్నప్పుడు నెలకొల్పిన సరస్వతి, భారతి సిమెంట్స్, సాక్షి మీడియా, క్లాసిక్ రియాలిటీ, యలహంక ప్రాపర్టీ మొదలైన వ్యాపారాలన్నింటిలో నలుగురు మనవళ్లకు సమాన వాటా ఉండాలనేది వైఎస్ఆర్ ఆదేశం అని తెలిపారు. నాకు వ్యక్తిగతంగా ఈ ఆస్తులపై మోజు లేదు. వారు చేసిన చిత్రహింసలకు ఈ ఆస్తులు పొందాలనే కోరిక కూడా లేదు. కేవలం నా బిడ్డలకు ఈ ఆస్తులు చెందాలి అనేది రాజశేఖర్ రెడ్డి కోరిక గనుక.. ఈ రోజు వరకు కూడా అమ్మైనా, నేనైనా తపన పడుతున్నాం. ఇప్పటికీ అమ్మ వెయ్యి సార్లు వీళ్లను అడిగి ఉంటుంది. ఇప్పటికీ అమ్మ వెయ్యి సార్లు వీళ్లను అడిగి ఉంటుంది. వందల కొద్దీ లేఖలు రాసి ఉంటుంది. అయినా నా బిడ్డలకు చెందాల్సిన ఆస్తిలో ఒక్కటి కూడా ఇవ్వలేదు. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత 10 ఏళ్లు జగన్ ఇబ్బందులు పడితే, నా కష్టాలు అనుకుని… శక్తికి మించి సాయం చేశాను. అన్న కోసం నా బిడ్డలను పక్కనబెట్టి ఎలాంటి స్వార్థం లేకుండా ఆయనను, ఆయన పార్టీని నా భుజాలపై వేసుకున్నాను అని షర్మిల తెలిపారు.