కురుమూర్తి స్వామి సాక్షిగా పాలమూరును అభివృద్ధి చేసి చూపిస్తా.. సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను పాలమూరు ప్రజలు పార్లమెంట్‌కు పంపింతే.. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ మహబూబ్ నగర్‌కు ఏం చేశారు? అని సీమర్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాలేదని, పరిశ్రమలు రాలేదని వాపోయారు. ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో వలసలు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి నెలా జిల్లా ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కురుమూర్తి స్వామి సాక్షిగా చెబుతున్నా ఈ ప్రాంత బిడ్డగా అన్ని రంగాల్లో పాలమూరును అభివృద్ధి చేస్తా అన్నారు. మాట నిలుపుకొకపొతే చరిత్ర క్షమించదని తెలిపారు.10 ఏళ్లు పాలించిన గత ప్రభుత్వం పరిశ్రమలు తీసుకురాలేదని, ప్రాజెక్టులు పూర్తి చేయలేదన్నారు. పాలమూరు వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి..ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, నా జిల్లా అభివృద్ధిని అడ్డుకోవద్దు, మిమ్మల్ని చరిత్ర క్షమించదని అన్నారు.ఎడారిగా మారిన పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు నిధులు కేటాయిస్తామని, జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తే ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు.