ఏ వర్గాన్ని కించపరిచే ఉద్దేశం నాకు లేదు… ట్రోల్స్ పై స్పందించిన సాయి పల్లవి
ప్రస్తుతం స్టార్ హీరోయిన్ సాయి పల్లవిని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. భారత సైన్యాన్ని అవమానించారంటూ నెటిజన్ సాయి పల్లవిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2022లో సాయి పల్లవికి సంబంధించిన ఇంటర్వ్యూ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతుంది. పాకిస్థాన్లోని ప్రజలు భారత సైనికులను ఉగ్రవాదులుగా చూస్తున్నారని సాయి పల్లవి ఆ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది. దాంతో ఆమెపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. భారత సైన్యం పాకిస్థాన్ ప్రజలను ఉగ్రవాదులుగా చూస్తోందని, పాక్ ప్రజలు కూడా భారత్ ని అలాగే చూస్తారని సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఎలాంటి హింస ఎప్పుడూ సరికాదని.. అది ఎలాంటి సమస్యలను పరిష్కరించదని చెప్పింది. అయితే నక్సల్స్ గురించిన ప్రశ్నకు ఈ సమాధానంలో కొంత భాగాన్ని మాత్రమే ఉపయోగించి ప్రస్తుతం సాయి పల్లవిపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అయితే దీనిపై సాయి పల్లవి స్పందిస్తూ.. ఏ వర్గాన్ని అవమానించాలనే ఉద్దేశం తనకు లేదని, ఇంటర్వ్యూలో కొంత భాగాన్ని మాత్రమే వైరల్ చేయడం బాధను కలిగించింది అని సాయి పల్లవి అన్నారు.