తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

హైదరాబాద్ వాహనదారులు అలెర్ట్.. ఆ ఫ్లైఓవర్ మూసివేత..!

07:15 PM Oct 23, 2024 IST | Teja K
UpdateAt: 07:15 PM Oct 23, 2024 IST
Advertisement

హైదరాబాద్ నగరంలో వాహనదారులకు ట్రాఫిక్ అధికారులు అలర్ట్ జారీ చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో నిత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ను వారం రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ ఎస్‌ఆర్‌డీపీ పనుల్లో భాగంగా శిల్పా లేఅవుట్ ఫేజ్-2 ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ ప్రకటించారు. అయితే.. మిగతా సమయంలో వాహనాలు రాకపోకలు సాగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నిర్ణీత సమయానికి గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.ఈ విషయంపై ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Advertisement
Tags :
flyover is closedGachibowli Flyoveridenijam newsidenijam telugu newsidenijam updatesmotorists alert.telangana
Advertisement
Next Article