ఏపీ రాష్ట్రంలో భారీ పెట్టుబడి.. ఏకంగా 65 వేల కోట్లు..!
08:43 PM Nov 12, 2024 IST | Teja K
UpdateAt: 08:43 PM Nov 12, 2024 IST
Advertisement
ఏపీ రాష్ట్రంలో రిలయన్స్ ఎనర్జీ రూ.65 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు సమక్షంలో రిలయన్స్ ఎనర్జీ గ్రూప్, ఏపీ విద్యుత్ శాఖ మధ్య అగ్రిమెంట్ కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలో 500 ఆధునిక బయోగ్యాస్ ప్లాంట్లను రిలయన్స్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా యువతకు సుమారుగా 2.5 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఏపీ ప్రభుత్వంతో, రిలయన్స్ సంస్థ ఎంఓయూ చేసుకోవడం, ఒక చారిత్రాత్మక ఘట్టమని మంత్రి లోకేశ్ అన్నారు. రిలయన్స్ తో ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తి చేయాలనీ ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహకారం అందిస్తుంది అని సీఎం చంద్రబాబు అన్నారు.
Advertisement