For the best experience, open
https://m.idenijam.com
on your mobile browser.

ఇళ్లు కూల్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామంటే ఎలా.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

08:00 PM Nov 07, 2024 IST | Teja K
UpdateAt: 08:00 PM Nov 07, 2024 IST
ఇళ్లు కూల్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామంటే ఎలా   కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Advertisement

మూసీ ప్రక్షాళనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి మూసీ నదికి నీళ్లు తెస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. మూసీ నదికి రిటైనింగ్ వాల్ నిర్మించాలని, నగరంలో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. కానీ మూసీ పరివాహక ప్రాంతంలో ఒక్క ఇంటిని కూల్చివేసినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇళ్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామంటే ఎలా? అని ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఉండేందుకు సిద్ధమన్నారు. అక్కడే ఉంటాం… ఓ రోజు అక్కడే పడుకుంటాం… అక్కడే భోజనం చేస్తాం అని కిషన్ రెడ్డి చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతంలో రేవంత్ రెడ్డి పర్యటనను ఆయన స్వాగతించారు.కుల గణనకు కూడా తాను వ్యతిరేకం కాదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement
Tags :
Advertisement

.