ఢిల్లీలో భారీగా కాలుష్యం.. కేంద్రం సంచలన నిర్ణయం..!
01:31 PM Nov 07, 2024 IST | Shiva Raj
UpdateAt: 01:31 PM Nov 07, 2024 IST
Advertisement
దేశ రాజధాని ఢిల్లీలో భారీగా కాలుష్యం పెరిగిపోతుంది. కాలుష్య నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అనుకున్న స్థాయిలో కాలుష్యాన్ని నియంత్రించలేకపోతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాలను దహనం చేసే రైతులకు భారీగా జరిమానాలు విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది.
Advertisement