UPI వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త..!
UPI వినియోగదారులకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అదిరిపోయే శుభవార్త తెలిపింది. ఇకపై ఎన్నైరైలు తమ కుటుంబ సభ్యులకు యూపీఐ ద్వారా రోజుకు రూ. లక్ష పంపించుకునే వెసులుబాటు కల్పించారు. అంతర్జాతీయ మొబైల్ నెంబర్‌ను ఉపయోగించి నేరుగా వారి యూపీఐ ద్వారా డబ్బులు పంపించుకోవచ్చు. ఈ సదుపాయాన్ని యూఎస్, కెనడా, యూకే, యూఏఈ, సింగపూర్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, హాంగ్‌కాంగ్, మలేషియా, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాలోని ఎన్నారైలకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఈ సదుపాయాన్ని హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్, ఇండస్‌ఇండ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, డీబీఎస్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, నేషనల్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంకులు అమలు చేస్తున్నాయి.