విద్యార్థులకు శుభవార్త.. మరో కొత్త పథకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లోని ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యేక కిట్‌లను పంపిణీ చేస్తుంది. విద్యార్థుల కోసం మరో కొత్త పథకాన్ని తీసుకురానున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం ఏటా రూ.953.71 కోట్లు వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ పథకానికి పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వ వాటా కింద రూ.175.03 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.778.68 కోట్లు వెచ్చించి విద్యార్థులకు కిట్లను అందజేయనున్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 35,94,774 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారని అధికారులు తెలిపారు. అయితే ఒక కిట్స్ లో టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, నోట్ బుక్స్, బెల్ట్, షూస్, బ్యాగ్, డిక్షనరీ, మూడు జతల యూనిఫారాలు ఉంటాయని తెలిపారు.