రైతులకు శుభవార్త.. రుణమాఫీ పై ప్రకటన.. దీపావళి తర్వాత అకౌంట్లలోకి డబ్బులు..!
రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి తెలంగాణ రైతులకు మరో శుభవార్త వినిపించింది. రైతులందరికీ రుణమాఫీ చేస్తామని.. మూడు విడతలుగా రుణమాఫీ ప్రక్రియ చేపట్టి చాలా వరకు రైతుల ఖాతాల్లోనే జమ చేశారు. అయితే ఆధార్ కార్డుల్లో పొరపాట్లు, బ్యాంకు ఖాతాల్లో అవకతవకల కారణంగా.. కొందరికి ఇంకా రుణమాఫీ రాలేదు. అయితే అన్నదాతలకు పెండింగ్ లో ఉన్న రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజా మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. రెండు మూడు నెలల్లోనే.. 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల మేర రుణమాఫీ చేసినట్టు మంత్రి తెలిపారు. పలు సాంకేతిక కారణాల వల్ల సుమారు 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదని.. వారికి కూడా దీపావళి పండగ తర్వాత రుణమాఫీ చేయనున్నట్టు ప్రకటించారు. దీపావళి తర్వాత మరో 4 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బులు జమకానున్నాయని మంత్రి సీతక్క తెలిపారు.