ఉద్యోగులకు శుభవార్త.. త్వరలో EPFO వేతన పరిమితి పెంపు..!
01:10 PM Nov 11, 2024 IST | Shiva Raj
UpdateAt: 01:11 PM Nov 11, 2024 IST
Advertisement
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కింద ఉన్న ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ‘ఎకనామిక్ టైమ్స్’ కథనం రాసింది. ప్రస్తుతం EPFO గరిష్ఠ వేతన పరిమితి రూ.15 వేలు ఉండగా.. దాన్ని రూ.21 వేలకు పెంచనున్నట్లు తెలుస్తోంది.
Advertisement