బిగ్ బాస్ లో గంగవ్వ అర్ధరాత్రి కేకలు.. దెయ్యం పట్టిందా..!
తెలుగులో బిగ్‌బాస్ ప్రస్తుతం ఎనిమిదో వారం నడుస్తోంది. సోమ, మంగళ వారాల్లో నామినేషన్స్ గొడవలతో ఓ రేంజ్లో సాగింది. ఈ వారంలో నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, విష్ణుప్రియ, మెహబూబ్, నయని పావని నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజైంది. నామినేషన్స్ ప్రక్రియ ముగియడంతో ఇక టాస్కుల గోల మొదలు కానుంది.
అయితే ఈ ప్రోమో బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న గంగవ్వ అర్ధరాత్రి కేకలు కనిపించింది. అందరూ లేచారు. ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి పరుగెత్తారు. అక్కడ గంగవ్వను చూసి అందరు షాక్ అయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు గంగవ్వ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆమె అరుపులు, కేకలు చూసి నివ్వెరపోయారు. ఆ తర్వాత గంగవ్వను అవినాష్, తేజ ధైర్యంగా గదిలోకి తీసుకెళ్లి బెడ్‌పై పడుకోబెట్టారు.
ఆ తర్వాత గంగవ్వకు దెయ్యం పట్టిందా అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా రోహిణి, హరితేజ 'నాకు నిద్ర కూడా పట్టడం లేదు' అని చర్చించుకుంటారు. కానీ అది పూర్తిగా ఫ్రాంక్ అని తేలింది. టేస్టీ తేజ, ముక్కు అవినాశ్, గంగవ్వ ముగ్గురు కలిసి మాట్లాడుకునే ఈ స్కారీ ఫ్రాంక్ చేశారు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఈ ముగ్గురు కలిసి ఇదంతా చేసినట్లు తెలుస్తోంది.