తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల స్కీమ్‌కి నిధులు విడుదల.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

08:40 PM Oct 28, 2024 IST | Teja K
UpdateAt: 06:17 PM Oct 29, 2024 IST
Advertisement

ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించిన సబ్సిడీ నిధులను విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లబ్ధిదారులకు ఇవ్వాల్సిన రూ.895 కోట్ల వన్ సిలిండర్ సబ్సిడీని విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం అక్టోబర్ 31న లబ్ధిదారులకు ఒక సిలిండర్ ఉచితంగా ఇవ్వనున్న సంగతి తెలిసిందే.
గ్యాస్ కంపెనీలు, పౌర సరఫరాల జాయింట్ ఖాతాకు 895 కోట్లు విడుదలయ్యాయి. లబ్ధిదారులు డిబిటి విధానంలో పట్టణ ప్రజలకు 24 గంటలలోపు మరియు గ్రామీణ ప్రజలకు 48 గంటలలోపు ఖాతాలలో నగదు జమ చేస్తారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తుంది. ఈ పథకం అమలుకు రూ.2684 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.

Advertisement

లబ్ధిదారులు ఈ నెల 29 నుంచి ఉచిత సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ పథకానికి ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు ఉంటే సరిపోతుందని ప్రభుత్వం ప్రకటించింది. సిలిండర్‌ను బుక్‌ చేసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. లబ్ధిదారులు ముందుగా సిలిండర్‌కు నగదు చెల్లిస్తారు. సిలిండర్‌ అందిన 24 నుంచి 48 గంటల్లోగా లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ అవుతుంది.

Advertisement

Tags :
andhrapradeshchandrababufree gas cylindersFunds released apGovt issues ordersidenijam newsidenijam telugu news
Advertisement
Next Article