ఏపీ రాజధాని అభివృద్ధికి కోసం ప్రపంచ బ్యాంకు.. రుణంపై కీలక ఉత్తర్వులు జారీ..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్ల రుణం మంజూరు చేశారు. ఈ నిధుల వినియోగంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మేరకు సీఆర్డీఏకు అధికారాలు కల్పించి విధివిధానాలను ఖరారు చేసింది. అమరావతి అభివృద్ధి ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. అమరావతి అభివృద్ధికి ప్రణాళికలను అమలు చేయాలని ప్రభుత్వం సీఆర్డీఏను ఆదేశించింది.
అమరావతి రాజధాని సుస్థిర అభివృద్ధికి ఏపీ సీఆర్డీఏ ప్రతిపాదనలు సమర్పించింది. ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు కూడా ఈ ప్రతిపాదనలను ఆమోదించి అమరావతి నగర అభివృద్ధికి ఒక్కొక్కరికి 800 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చాయి. మిగిలిన నిధులను కేంద్రం సాయంతో రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని స్పష్టం చేశారు. ప్రపంచబ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌ల నుంచి ఆర్థిక సహాయం కోరేందుకు ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌కు అధికారం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.