దశలు వారీగా రైతు భరోసా.. అప్పటినుంచే రైతు ఖాతాలో డబ్బు..!
04:03 AM Nov 16, 2024 IST | Shiva Raj
UpdateAt: 05:08 PM Nov 15, 2024 IST
Advertisement
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజా మాట్లాడుతూ.. మిగిలిన రైతులకు డిసెంబర్ లోపు పక్కాగా రుణమాఫీ చేస్తామని వ్యాఖ్యానించారు. మిగిలిని రూ.13 వేల కోట్లు త్వరలోనే చెల్లిస్తామన్నారు. త్వరలో రైతు భరోసా ఒక కిస్తీ చెల్లిస్తామని చెప్పారు. రాబోయే పంట కాలం నుంచి రైతులకు ఎకరాకు రూ.7500 సాయం అందిస్తామని తెలిపారు. ఎకరా నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి రైతు భరోసాను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహించనుంది.
Advertisement