For the best experience, open
https://m.idenijam.com
on your mobile browser.

ఎవ్వరూ అడ్డొచ్చిన సరే నేను మూసీ ప్రక్షాళన చేసి తీరతా.. సీఎం రేవంత్‌ రెడ్డి

06:47 PM Nov 08, 2024 IST | Teja K
UpdateAt: 06:47 PM Nov 08, 2024 IST
ఎవ్వరూ అడ్డొచ్చిన సరే నేను మూసీ ప్రక్షాళన చేసి తీరతా   సీఎం రేవంత్‌ రెడ్డి
Advertisement

నేడు పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ పునరుజ్జీవన సంకల్ప యాత్ర చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంగెం నుంచి నాగిరెడ్డి పల్లి వరకు 2.5 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నీరు, పాలు, కూరగాయలు కలుషితమవుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జెండా, ఎజెండాను పక్కన పెట్టి మూసీ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలన్నారు. మూసీ అణుబాంబు కంటే ప్రమాదకరంగా మారనుంది. మూసీ నీరు విషపూరితంగా మారబోతుంది.
మూసీ పరివాహక ప్రాంత ప్రజల కష్టాలు తీర్చేందుకు సంగెం శివయ్యను దర్శించుకున్నా.. నా జన్మదినం రోజున ఆయనను దర్శించుకోవడం..నా జన్మ ధన్యం అయింది. ప్రజలను ఎలా దోచుకోవాలో బీఆర్‌ఎస్‌కు మాత్రమే తెలుసునని అన్నారు. గంగా ప్రక్షాళన చేస్తే… పొగుడుతున్న వాళ్లే.. మూసీ ప్రక్షాళన చేస్తామంటే ఎందుకు విమర్శిస్తారు. ఎవరైనా అడ్డుకున్న మూసీని శుభ్రం చేస్తానని ప్రకటించారు. బుల్డోజర్లను అమర్చి మరిన్ని ప్రాజెక్టులు చేపడతామని పేర్కొన్నారు. బాధిత రైతుల బాధలు తనకు తెలుసునని అన్నారు. ఇక్కడ గేదె, ఆవు పాలు కొనాల్సిన అవసరం లేదన్నారు. నేను ఎవ్వరూ అడ్డొచ్చిన రంగారెడ్డి జిల్లాలో మూసీ ప్రక్షాళన చేసి తీరతా. బుల్డోజర్లకు అడ్డంగా నిలబడాలనుకునేవారు పేర్లు ఇవ్వండి.. మీ పై నుంచి బుల్డోజర్లను నడిపిస్తా. మూసికి అడ్డువస్తే కేసీఆర్ కుక్కచావు చస్తావు. నల్గొండ ప్రజలు నీకు ఓట్లు వెయ్యలేదని కక్ష కట్టావు అంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాక్యాలు చేసారు.

Advertisement
Tags :
Advertisement

.