చెన్నై వదిలి ముంబైకి షిఫ్ట్ అయినా హీరో సూర్య.. ఆ నిర్ణయం వెనుక రహస్యం ఏంటి.. ?
తమిళ స్టార్ సూర్యకు ప్రపంచ వ్యాప్తంగా లెక్కలేనన్ని అభిమానులు ఉన్నారు. స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక చెన్నై వదిలి ముంబైలో స్థిరపడ్డారు. తమిళనాడు, చెన్నైలు సూర్యను స్టార్‌ని చేశాయని, అయితే ముంబైకి వెళ్లి తన రాష్ట్రానికి ద్రోహం చేశాడని కొందరు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. మరోవైపు, సూర్యకు మద్దతుగా కొంతమంది నిలబడి, అతను తమిళ సినిమాని వదిలిపెట్టలేదని, తన ఇంటిని ముంబైకి మార్చాడని, దాని వల్ల ఎటువంటి నష్టం లేదని అన్నారు.
ఈ ప్రశ్నకు సూర్య ఓ ఇంటర్వ్యూలో సమాధానమిచ్చారు. ఆయన మాట్లాడుతూ, '25 ఏళ్ల క్రితం జ్యోతిక నా కోసం కెరీర్, స్నేహితులు, కుటుంబ సభ్యులను వదిలి ముంబై నుంచి చెన్నైకి వచ్చింది. ఇప్పుడు ఆమె కోసం చెన్నై వదిలి ముంబైకి షిఫ్ట్ అయ్యాను. భార్య కోరిక తీర్చేందుకే సూర్య ముంబైకి మకాం మార్చినట్లు తెలిపాడు. సూర్య మరియు జ్యోతిక ప్రేమ వివాహం చేసుకున్నారు మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు.