డోనాల్డ్ ట్రంప్ కొత్త చట్టం.. భారతీయులకు కొత్త చిక్కులు
ఇకపై అమెరికా వెళ్లిన దంపతులకు పిల్లలు పుడితే వెంటనే అమెరికా పౌరసత్వం పొందే అవకాశం లేదు. ఇప్పటి వరకు, అమెరికాలో జన్మించిన ప్రతి శిశువుకు స్వయంచాలకంగా అక్కడి పౌరసత్వం పొందేందుకు నియమాలు ఉన్నాయి.ఇప్పుడు ట్రంప్ తీసుకొచ్చిన కొత్త నిబంధనతో ఆ అవకాశం కనుమరుగవుతోంది. అక్రమంగా అమెరికాలో ఉండేందుకు ప్లాన్లు వేసే వారిని అడ్డుకునేందుకు ట్రంప్ ఈ కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నారు. హెచ్1బీ, ఎఫ్1 వీసాలపై అక్కడ పనిచేస్తున్న వారిని, వారి కుటుంబీకులను ఇది దెబ్బతీస్తుంది.
ఇక నుంచి అక్కడ పుట్టిన పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించే అవకాశం లేదు. అక్కడ బిడ్డ పుట్టినా.. తల్లిదండ్రుల్లో కనీసం ఒకరికి గ్రీన్‌కార్డు కాని.. అమెరికా సిటిజన్‌షిప్ కాని ఉండాల్సిందే. ఈ చట్టం 12 లక్షల మందిపై ప్రభావం చూపనుంది. ఎందుకంటే ఇప్పటికే 12 లక్షల మంది గ్రీన్ కార్డ్ కోసం క్యూలో ఉన్నారు. EB1 కేటగిరీలో 1.5 మిలియన్ల మంది, EB2 కేటగిరీలో 8.5 మిలియన్ల మంది, EB3 కేటగిరీలో 2.5 మిలియన్ల మంది ఉన్నారు. గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఆరు లక్షల మంది ఉంటే.. వారిపై ఆధారపడిన వారు ఆరు లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు గ్రీన్ కార్డుల జారీ కష్టమైతే.. ట్రంప్ తీసుకొచ్చిన కొత్త చట్టంతో మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. హెచ్1బీ వీసా స్కాంపై అమెరికా ఇప్పటికే ఉక్కుపాదం మోపింది. ఇప్పుడు ఈ చట్టంతో అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయుల కలలు మరింత కష్టతరంగా మారనున్నాయి.