రైలులో మీ బైక్‌ను లేదా కారును ఎలా పార్సెల్ చేయాలో తెలుసా.. మరి ధర ఎంతో..?
మన భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణిస్తున్నారు. రైలు ప్రయాణం మనకు సౌకర్యంగా ఉంటుంది. అలాగే రైలు ప్రయాణంలో కూడా అనేక సౌకర్యాలు ఉన్నాయి. బైకులు, కార్లు కూడా రైలులో ఒక నగరం నుండి మరొక నగరానికి తీసుకువెళతారు. రైలులో కారు, బైక్ పంపితే ఎంత వసూలు చేస్తారో చాలా మందికి తెలియదు.
ఇపుడు ఎంత ఛార్జ్ వసూలు చేస్తారో తెలుసుకుందాం.. రైళ్లలో బైక్ తీసుకెళ్తే మొదట ఎంత దూరం చూస్తారు. ఆ తరువాత దాని బరువు కూడా లెక్కిస్తారు. 500 కిలోమీటర్లలోపు (కిలోమీటర్లు) రవాణా చేస్తే అద్దె 2000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 500 కి.మీ కంటే ఎక్కువ దూరం ఉంటే, మొత్తం ఛార్జీలు రూ. 8000 చెల్లించాలి. దీని కోసం ప్రత్యేక ప్యాకింగ్ ఛార్జీ ఉంటుంది. కొన్నిసార్లు దూరం బైక్ బరువును బట్టి ఈ ఛార్జీలు మారవచ్చు. మీరు ఒక నగరం నుండి మరొక నగరానికి కారును పంపాలనుకున్నప్పుడు, మీరు ఒక పార్శిల్ (స్పెషల్ ప్యాకింగ్ ఛార్జ్) బుక్ చేసుకోవాలి. దీన్ని సామాన్లుగా పంపలేరు కాబట్టి ఆటోమొబైల్ మోస్తున్న వాహనం ద్వారా పంపే అవకాశం ఉంటుంది. ఇక ఛార్జీ వస్తువుల బరువు బట్టి లెక్కిస్తారు.