రోజుకి ఎన్ని యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయో తెలుసా..?
దేశీయంగా యూపీఐ లావాదేవీలు పెరుగుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అంచనా ప్రకారం రోజుకు 500 మిలియన్ల (50 కోట్లు) లావాదేవీలు జరుగుతున్నాయని గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. త్వరలోనే బిలియన్ (100 కోట్లు) మార్కును చేరుకుంటుందని శక్తికాంత తెలిపారు.
భవిష్యత్తులో ఆన్‌లైన్ లావాదేవీలు మరింత ప్రాచుర్యం పొందుతాయి. అదనంగా, చెల్లింపులకు సంబంధించి ఎలాంటి భద్రతా లోపాలను నివారించడానికి మేము మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నాము. ఆర్‌బీఐ ఆధ్వర్యంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) అందుకోసం అన్ని చర్యలు తీసుకుంటోంది. యూపీఐ వ్యవస్థ ఆన్‌లైన్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చేసింది. ప్రస్తుతం రోజుకు 50 కోట్ల యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. వీటిని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. రానున్న రోజుల్లో ఈ సంఖ్యను ఒక బిలియన్ (100 కోట్లు)కి పెంచాలని భావిస్తున్నాం అని తెలిపారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) డేటా ప్రకారం, ఆగస్టులో రోజువారీ యూపీఐ లావాదేవీలు 483 మిలియన్లకు చేరుకున్నాయి అని శక్తి కాంత్ దాస్ తెలిపారు.