ఏసీబీ వలలో డీఈవో.. లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు..!
11:36 AM Nov 07, 2024 IST | Shiva Raj
UpdateAt: 11:36 AM Nov 07, 2024 IST
Advertisement
మహబూబ్నగర్ జిల్లా డీఈవో రవీందర్ ఏసీబీ వలలో చిక్కారు. తనకు రావాల్సిన సీనియారిటీ రాకపోవడంతో ఓ ఉపాధ్యాయుడికి న్యాయం చేయాలని పలుమార్లు డీఈవోను రవీందర్ కలిశారు. దీని కోసం డీఈవో రవీందర్ రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో సదరు ఉపాధ్యాయుడు ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ను ఆశ్రయించాడు. పథకం ప్రకారం గురువారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలోని డీఈవో ఇంటికి టీచర్ వెళ్లి రూ.50 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ బృందం డీఈవోను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రూ.50 వేలు స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు.
Advertisement