ప్రాజెక్టులను ఆపివేయడంలో కాంగ్రెస్‌కు డబుల్ పీహెచ్‌డీ ఉంది.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్రలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి పథకాలు ఆగిపోతాయని ప్రధాని మోదీ అన్నారు. "ప్రాజెక్టులను నిలిపివేయడంలో కాంగ్రెస్‌కు డబుల్ పీహెచ్‌డీ ఉందని తూర్పు విదర్భలోని చంద్రపూర్ జిల్లాలోని చిమూర్‌లో జరిగిన ఎన్నికల సమావేశంలో ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ ప్రజలను విభజిస్తోందని, దేశాన్ని పాలించడానికే కాంగ్రెస్ పుట్టిందన్న ‘షాహీ పరివార్’ (రాచరిక కుటుంబం) మనస్తత్వం అని ప్రధాని మోదీ ఆరోపించారు. స్వాతంత్య్రానంతరం దళితులు, వెనుకబడిన తరగతులు, ఆదివాసీలను కాంగ్రెస్ ఏనాడూ పురోగమనానికి అనుమతించలేదని మోదీ అన్నారు.బిజెపి "సంకల్ప్ పాత్ర" ఎన్నికల మేనిఫెస్టోను మహారాష్ట్ర అభివృద్ధికి నిబద్ధతగా పిఎం మోడీ అభివర్ణించారు. వారు అభివృద్ధిని అడ్డుకోవడంలో మాత్రమే నైపుణ్యం సాధించారు అని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్, అఘాడీల నుంచి అడ్డంకులు ఎదురైనా గత రెండున్నరేళ్లలో ‘మహాయుతి’ హయాంలో మహారాష్ట్ర అపూర్వమైన అభివృద్ధిని సాధించిందని, దేశంలో విదేశీ పెట్టుబడులకు మహారాష్ట్ర అనుకూలమైన గమ్యస్థానంగా అభివర్ణించారు.