తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే భూస్థాపితం కానుంది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

05:46 PM Nov 11, 2024 IST | Teja K
UpdateAt: 05:46 PM Nov 11, 2024 IST
Advertisement

ఆ అసమర్ధ వల్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని త్వరలోనే భూస్థాపితం చేయనుంది అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనా వైఫల్యం, శాంతిభద్రతల వైఫల్యానికి తాజా ఉదాహరణ ఇవ్వాళ రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గం కొడంగల్‌లో ఏకంగా జిల్లా కలెక్టర్ మీదనే తిరగబడ్డ రైతులు. ముఖ్యమంత్రి మూర్ఖత్వం వల్ల అధికారులు దెబ్బలు తినాల్సి రావడం దురదృష్టకరం అని కేటీఆర్ వాపోయారు. నిజానికి రేవంత్ రెడ్డి దురాశ వల్ల, అవగాహనారాహిత్యం వల్లనే ఈ దుస్థితి దాపురించింది అని మండిపడ్డారు. భూసేకరణ పూర్తయ్యి, అన్ని అనుమతులు వచ్చి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఫార్మా సిటీని రద్దు చేసి, రాష్ట్రంలో పది చోట్ల ఫార్మా క్లస్టర్లు పెట్టాలనే తుగ్లక్ అలోచన వల్లనే ఇంత అలజడి రేగింది అని కేటీఆర్ నిలదీశారు.ఫార్మా సిటీకోసం సేకరించిన భూములు అమ్ముకొని సొమ్ముచేసుకుందామన్న రేవంత్ కుత్సిత బుద్ధి వల్ల ఇప్పుడు ఇక్కడ ఫార్మా సిటీ భవితవ్యం ప్రమాదంలో పడింది, అక్కడ కొడంగల్‌లో అన్నదాతల భూములు గుంజుకునే కుట్ర మొదలైంది అని పేర్కొన్నారు.రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, ఆగ్రహం, చాలాచోట్ల కట్టలు తెంచుకుంటోంది. అది ఈ అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని త్వరలోనే భూస్థాపితం చేయనుంది.. అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Advertisement
Tags :
congress busthapithamCongress Governmentidenijam newsktrtelanganatelugu latest news in idenijam
Advertisement
Next Article