తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

మూసీ పునరుద్ధరణపై తమ ప్రభుత్వం ముందుకు వెళుతుంది తప్ప వెనక్కి తగ్గేది లేదు.. సీఎం రేవంత్ రెడ్డి

04:45 PM Oct 29, 2024 IST | Teja K
UpdateAt: 04:45 PM Oct 29, 2024 IST
Advertisement

మూసీ పునరుజ్జీవ పనులకు తమ ప్రభుత్వం ముందుకే వెళుతుంది తప్ప వెనక్కి తగ్గేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నవంబర్ 1న మూసీ పునరుజ్జీవ పనులను పథకానికి శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు.
ముందుగా బాపూఘాట్ నుంచి 21కిలోమీటర్ల వెనక్కు అభివృద్ధి చేసి మల్లన్న సాగర్ నుంచి నీటిని తరలిస్తామని వెల్లడించారు. ఈ నీటి తరలింపునకు నవంబర్‌లో టెండర్లు పిలవనున్నారు. మూసీ పునరుద్ధరణతో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.మూసీ పునరుద్ధరణపై ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయని, వారితో చర్చలకు సిద్ధమని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. మూసీ పునరుద్ధరణపై అభ్యంతరాలుంటే తెలియజేయాలని బీఆర్‌ఎస్‌ నాయకులు సూచించారు.

Advertisement

Advertisement
Tags :
cm revanth reddygovernment moves forwardidenijam newsidenijam telugu newsrestoration of Musitelangana
Advertisement
Next Article