యాదాద్రి వరకు ఎంఎంటీఎస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
02:24 PM Oct 24, 2024 IST | Teja K
UpdateAt: 02:47 PM Oct 24, 2024 IST
Advertisement
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పార్లమెంటు సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లోని సమస్యలను ప్రస్తావించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ రైల్వే శాఖ నిర్మాణాత్మకంగా పనిచేస్తోందన్నారు. కొత్త రైల్వే స్టేషన్లు, పునరుద్ధరణ పనుల పట్ల అందరూ సానుకూలంగా ఉన్నారు. రైలు తయారీ యూనిట్ రాబోతోంది. ఎంఎంటీఎస్‌ను యాదాద్రి వరకు పొడిగించాలని నిర్ణయించాం. గుట్కేసర్.. రాయగిరి, యాదాద్రి వరకు విస్తరించాలి. 650 కోట్ల అదనపు భారం పడనుంది. 2/3 రాష్ట్ర ప్రభుత్వం అందించాలి…కానీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వమే ఈ పనులు పూర్తి చేయనుంది. వచ్చే రెండేళ్లలో ఈ రూట్ ఎంఎంటీఎస్ పనులు పూర్తి చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.
Advertisement