తెలంగాణాలో కులగణన.. ఇది ప్రభుత్వ సర్వే కాదు.. కాంగ్రెస్ రాజకీయ డైవర్షన్ సర్వే..!
03:31 PM Nov 07, 2024 IST
|
Vinod
UpdateAt: 03:31 PM Nov 07, 2024 IST
Advertisement
తెలంగాణలో ప్రారంభమైన కులగణన సర్వే పై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఇది ఒక ఫెయిల్డ్ సర్వే అని రాజకీయ విశ్లేక్షకులు అభిప్రాయం పడుతున్నారు. ఈ కులగణన సర్వే పై కొందరు రాజకీయ విశ్లేక్షకుల నుండి వస్తున్న కొన్ని ప్రశ్నల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
- కులగణన సర్వే నవంబర్ 6 నుంచి 30 వరకు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే సర్వే ఇన్ని రోజులు ఎందుకు? గత ప్రభుత్వం ఒక్కరోజులో పూర్తి చేసిన సర్వే ఇప్పుడు ఇన్ని రోజులు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. అలాగే మొదటి మూడు రోజులు సర్వే పోస్టర్లు అతికించి ఆ తర్వాత సర్వే ప్రారంభిస్తారట.. అలాంటప్పుడు సర్వే ప్రారంభమని ప్రకటించడం ఎందుకు.. ఈ పనంతా ముందే చూసుకోవాలి కదా అని రాజకీయ విశ్లేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.
- కులగణన సర్వేలో.. కుటుంబ వివరాలను తెలిపే 75 ప్రశ్నలతో 8 పేజీలు ఉంటాయట..అయితే అంత సమాచారాన్ని ఇవ్వడానికి ప్రజలు ఇష్టపడరు. అలాంటప్పుడు ఇన్ని ప్రశ్నలు ఎందుకు..?
- కులగణన సర్వే ప్రక్రియ.. ప్రభుత్వం చేపట్టిన సర్వే లాగా లేదు.. కాంగ్రెస్..వారి హయంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చేపట్టిన డైవర్షన్ సర్వే లాగా ఉందని రాజకీయ విశ్లేక్షకులు అభిప్రాయం పడుతున్నారు. దీనికి మరో కారణం కులగణన ప్రారంభ కార్యక్రమానికి రాహుల్ గాంధీ రావడమే, రాహుల్ గాంధీకి కులగణన సర్వే కు సంబంధం ఏంటి.. అని ప్రశ్నిస్తున్నారు. ఇది ఓటు కోసం జరుగుతున్న కాంగ్రెస్ రాజకీయ డైవర్షన్ సర్వే అని వారు అభిప్రాయం పడుతున్నారు.
- గత ప్రభుత్వం కూడా ఈ సర్వే చేసింది. అయితే ఆ డేటా అలాగే ఉంటుంది కదా..మరి ఇప్పుడు మళ్ళీ సర్వే ఎందుకు? దీన్ని బట్టి చూస్తే ఇది నిజంగా కాంగ్రెస్ ఆడుతున్న రాజకీయ డైవర్షన్ సర్వే అని రాజకీయ విశ్లేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
Advertisement
Next Article