లగచర్ల కలెక్టర్ పై దాడి కేసు.. నరేందర్ రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్
07:00 PM Nov 13, 2024 IST | Teja K
UpdateAt: 07:00 PM Nov 13, 2024 IST
Advertisement
వికారాబాద్ జిల్లాలోని లగచర్ల గ్రామంలో కలెక్టర్ ప్రతీక్ జైన్ పై స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో కొడంగల్ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్రరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజగా నరేందర్ రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలో పోలీసులు నరేందర్ రెడ్డిని వైద్య పరీక్షలు నిర్వహించి కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి ఈ నెల 27 వరకు రిమాండ్ విధించింది. నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించనున్నారు.
Advertisement