For the best experience, open
https://m.idenijam.com
on your mobile browser.

మహారాష్ట్రలో బీజేపీ మేనిఫెస్టో విడుదల.. రైతులు, మహిళలు యువతకు హామీలు

03:45 PM Nov 10, 2024 IST | Teja K
UpdateAt: 03:48 PM Nov 10, 2024 IST
మహారాష్ట్రలో బీజేపీ మేనిఫెస్టో విడుదల   రైతులు  మహిళలు యువతకు హామీలు
Advertisement

మహారాష్ట్రలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికలకు సంబంధించి ‘సంకల్ప్‌ పత్ర’ పేరుతో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మేనిఫెస్టోను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ బీజేపీ యువత, పేద, రైతులు, మహిళల అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ భవన్‌కులే, ముంబై బీజేపీ అధ్యక్షుడు ఆశిష్ షెలార్ తదితరులు పాల్గొన్నారు.మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో నవంబర్ 20న ఎన్నికలు జరగనుండగా.. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

బీజేపీ మేనిఫెస్టో ప్రధాన హామీలు..

Advertisement

1. యువతకు 25 లక్షల ఉద్యోగాలు
2.స్కిల్‌ సెన్సస్‌: రాష్ట్రంలో మరిన్ని ఉద్యోగాల కల్పన లక్ష్యంగా స్కిల్‌ సెన్సస్‌
3.లఖపతి దీదీ పథకం 50 లక్షల మంది మహిళలకు విస్తరణ
4.ఎరువుల జీఎస్టీ రైతులకు వాపస్‌
5.పరిశ్రమల వృద్ధికి వడ్డీ లేని రుణాలు
6.వ్యవసాయ రుణాల మాఫీ
7.వృద్ధులకు పెన్షన్ రూ.2100కు పెంపు
8.నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేసేందుకు చర్యలు

Tags :
Advertisement

.