తెలంగాణ సీఎం సహాయ నిధికి 'బ్యాంక్ ఆఫ్ బరోడా' భారీ విరాళం
03:39 PM Oct 24, 2024 IST | Teja K
UpdateAt: 03:42 PM Oct 24, 2024 IST
Advertisement
ఇటీవలే కురిసిన భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో పారిశ్రామికవేత్తలు, టాలీవుడ్ ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. తాజాగా వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి 'బ్యాంక్ ఆఫ్ బరోడా' 1 కోటి రూపాయల విరాళం అందించింది. గురువారం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ రితేష్ కుమార్, డీజీఎం ఎంవీఎస్ సుధాకర్ కలిసి ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు.
Advertisement