రాజస్థాన్‌లో దారుణం.. ప్రసాదంలో మత్తు కలిపి భక్తురాలిపై పూజారి అత్యాచారం
ఆలయానికి వచ్చిన మహిళపై పూజారి అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్థాన్‌లో వెలుగు చూసింది. బాధితురాలు పూజారిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతనిపై కేసు నమోదైంది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు.. సికార్ జిల్లాలోని ఓ ఆలయంలో బాబా బాలక్ నాథ్ అనే వ్యక్తి పూజారిగా పనిచేస్తున్నాడు. దైవ దర్శనం కోసం ఆలయానికి వెళ్లిన బాధిత మహిళతో పరిచయం పెంచుకుని కుటుంబ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని నమ్మించాడు. దేవుడికి ఇచ్చిన ప్రసాదం తింటే సమస్యలు తగ్గుతాయని నమ్మించి.. మత్తుమందు కలిపిన ప్రసాదం ఇచ్చాడు. ప్రసాదం తిని స్పృహ కోల్పోయిన మహిళ తనపై మూడు సార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ దారుణాన్ని కెమెరాలో రికార్డ్ చేశాడని తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఈ ఘటన.. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని, వీడియోను నెట్‌లో అప్‌లోడ్ చేసి వైరల్ చేస్తానని అనుచరులు బెదిరించారని బాధితురాలు వెల్లడించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు కేజీ నమోదు చేసారు