తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

ఏలూరులో దారుణం… అనాథ మృతదేహాలతో వ్యాపారం..!

01:53 PM Oct 20, 2024 IST | Teja K
UpdateAt: 01:55 PM Oct 20, 2024 IST
Advertisement

ఏలూరు సర్వజన ఆసుపత్రిలోని మార్చురీ దారుణాలకు కేంద్ర బిందువుగా మారింది..అక్కడ ఉన్న కొందరు సిబ్బందికి అనాథ శవాలే ఆదాయ వనరుగా మారాయి. గత కొంత కాలంగా ఏలూరు జీజీహెచ్‌లో జరుగుతున్న అవినీతి బట్టబయలైంది. ఆస్పత్రిలో అనాథ శవాలను భారీ రేటుకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదిన్నర కాలంలో 8-10 అనాథ శవాలు ఇతర రాష్ట్రాలు తరలించినట్లు తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్రం చెన్నై, బెంగళూరులోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు మృతదేహాలను భారీ రేట్లకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఒక్కో డెడ్ బాడీ రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని అంబులెన్సుల ద్వారా అనాథ శవాలను తరలించేందుకు కేవలం అంబులెన్స్ లకే రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ పూర్తి విచారణ చేపట్టాలని నిర్ణయించారు.

Advertisement

Advertisement
Tags :
eluru hosipitalidenijam newsidenijam telugu newsorphan dead bodies''telugu latest news in idenijam
Advertisement
Next Article