వరంగల్ జిల్లాలో దారుణం.. బాలికపై అత్యాచారయత్నం చేసిన సీఐ
07:26 PM Oct 23, 2024 IST
|
Teja K
UpdateAt: 07:26 PM Oct 23, 2024 IST
Advertisement
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ సీఐ బాలికపై అత్యాచారానికి యత్నించాడు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులకు బాలిక జరిగిన విషయాన్ని చెప్పింది. వెంటనే వెళ్లి కాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేసారు. సీఐపై లైంగిక వేధింపులు, పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సీఐ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమాజంలో అత్యాచార ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన పోలీసులే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని స్థానిక రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement
Next Article