తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

ఏపీపీఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తులను పరిశీలించి, న్యాయం చేయాలి.. వైఎస్ షర్మిల డిమాండ్

04:58 PM Nov 16, 2024 IST | Teja K
UpdateAt: 04:59 PM Nov 16, 2024 IST
Advertisement

మెయిన్స్ షెడ్యూల్ విడుదల కాకముందే అభ్యర్థుల విజ్ఞప్తులను పరిశీలించి, న్యాయం చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు.. రాష్ట్రంలోని గ్రూప్ 1 అభ్యర్థుల పక్షాన మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం అని వైఎస్ షర్మిల అన్నారు. గ్రూప్ 2, డిప్యూటీ ఈవో పోస్టుల ఎంపికలో అనుసరించిన 1:100 విధానాన్ని , గ్రూప్ 1 మెయిన్స్ కి సైతం పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాం. జివో నంబర్ 5 ప్రకారం 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసే అధికారం ఏపీపీఎస్సీ కి ఉంది. ఆ అధికారాన్ని ఉపయోగించి 1:100 రేషియో ప్రకారం అవకాశం ఇవ్వమని అభ్యర్థులు అడగడంలో న్యాయం ఉంది అని తెలిపారు. 89 పోస్టులకు మీరు ఇచ్చిన 1:50 రేషియో ద్వారా 4450 మంది మెయిన్స్ కి అర్హత పొందారు. 1:100 రేషియో లెక్కన పిలిస్తే మరో 4450 మందికి అవకాశం దక్కుతుందని అభ్యర్థులు ఆశ పడుతున్నారు అని తెలిపారు.
గ్రూప్ 2, గ్రూప్ 1 పరీక్షల మధ్య సమయం తక్కువగా ఉండటం, సిలబస్ మధ్య వ్యత్యాసం, కొత్త సిలబస్ అని చెప్పి పాత సిలబస్ లోనే పరీక్షలు నిర్వహించడం లాంటి కారణాలతో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అని తెలిపారు. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న గ్రూప్ 1 ఉద్యోగాలు మళ్ళీ పోతే ఇప్పట్లో ఇక నోటిఫికేషన్ ఉండదని అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్ నీ కలిసి విజ్ఞప్తి చేసినా ప్రభుత్వానికి పట్టింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెయిన్స్ షెడ్యూల్ విడుదల కాకముందే అభ్యర్థుల విజ్ఞప్తులను పరిశీలించి, న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తుంది అని వైఎస్ షర్మిల తెలిపారు.

Advertisement

Advertisement
Tags :
andhrapradeshchandrababujusticeYS Sharmila
Advertisement
Next Article